బెంగళూరు: సుప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? కర్ణాటకలో ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయడం చర్చకు కారణమైంది. ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. దీంతో బ్రహ్మానందం బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు కథనా లు వినిపిస్తున్నాయి. చిక్కబళ్లాపుర, బాగేపల్లి, గౌరిబిదనూరు నియోజకవరాల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. తెలుగు సినీ నటుల ప్రభావం కూడా ఈ ప్రాంతం లో ఎక్కువే. 2018లో చిక్కబళ్లాపుర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కిరణ్ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు.
We Want To Provide All Type Of Services For Our Siddipet Citizens.. Now A Days Time is Most Important Than Money.. Some Times We Want To Spend More Money.But We Dont Get A Good Service..So That's Why We Think That All Type Of Problems Will Get A Good Solution Here.. Read More